- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువు ఛాయలు : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనCongress governmentలో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరువు ఛాయలు(Shadows of Drought Again) అలుముకుంటున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనCongress governmentలో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరువు ఛాయలు(Shadows of Drought Again) అలుముకుంటున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. రాష్ట్రంలో వేసవికి ముందే పడిపోతున్న భూగర్భ జల మట్టంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో దుంకిన మత్తడులు..నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న వరి మడులు..నాడు ఉప్పొంగిన గంగమ్మ..నేడు అడుగంటుతున్న భూగర్భజలాలు..పదేళ్ల పాలనలో దేశంలోనే అత్యధికంగా పెరిగిన భూగర్భజలాలు..నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేగంగా పడిపోతున్న భూగర్భజలాల పరిస్థితి రాష్ట్రంలో కరువు ఛాయలకు నిదర్శనమన్నారు.
నాలుగు నెలలలో 2 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోగా..32 జిల్లాలలో దాని ప్రభావం కనిపిస్తుందని..సాగు..తాగునీటీ ఎద్దడి ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయన్నారు. రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావుపెట్టిన ఫలితమే భూగర్భ జలమట్టం పడిపోవడానికి కారణమని కేటీఆర్ ఆరోపించారు. నాడు ఎత్తిపోతలతో చెరువులు, కుంటలు, వాగులు వంకలు నీటితో పారిస్తే..నేడు ఎత్తిపోతలను గాలికి వదిలి .. గాలి ఆరోపణలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు.
రైతుల శ్రమను పణంగా పెట్టి, పొలాలు ఎండబెట్టి .. కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ ఇదంతా అని..తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని కేటీఆర్ కోరారు. కాగా రాష్ట్రంలో గత ఏడాది ఆక్టోబర్ లో భూగర్భ జలాలు ఉపరితలం నుంచి సగటున 5.38మీటర్ల లోతులో ఉండగా..ఈ ఏడాది జనవరికే 7.46మీటర్ల లోతుకు పడిపోయాయని, గత నాలుగు నెలల్లోనే 2.08మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయిందని అధికారులు వెల్లడిస్తున్నారు.






