మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి SFI నేతల యత్నం.. పలువురు నేతల అరెస్ట్

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల అంశం రోజురోజుకూ ముదురుతోంది.

మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి SFI నేతల యత్నం.. పలువురు నేతల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల అంశం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన నిరవధిక బంద్ రెండో రోజుకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ (Karimnagar) పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, స్కాలర్‌షిప్స్ వెంటనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.

ఈ నేపథ్యంలోనే వారిని పోలీసులు అడ్డుకోగా ఇరు పక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో SFI కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా SFI నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు యాజమాన్యాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చదువు పూర్తి అయినా.. నేటికీ సర్టిఫికేట్లు అందని పరిస్థితి ఉందన్నారు. ఫీజుల గురించి ప్రశ్నిస్తే కాలేజీల యాజమాన్యాలను విజిలెన్స్ దాడులంటూ ప్రభుత్వం బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలని SFI నాయకులు డిమాండ్ చేశారు.

Next Story