రూరల్ తెలంగాణ జిల్లాలకు 3 గంటల్లో భారీ వర్షం.. రాత్రికి హైదరాబాద్‌లో పరిస్థితి?

by Naga Rani Yarlagadda |

రూరల్ తెలంగాణ జిల్లాల్లో రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

రూరల్ తెలంగాణ జిల్లాలకు 3 గంటల్లో భారీ వర్షం.. రాత్రికి హైదరాబాద్‌లో పరిస్థితి?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో సుమారు 3 గంటలుగా భారీ వర్షం దంచికొడుతోంది. వర్షానికి నాలాలు పొంగి పొర్లుతుండటంతో సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వాసులు అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ, రెస్క్యూ టీమ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రూరల్ తెలంగాణ జిల్లాల్లో రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

నల్గొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించారు. ఇక హైదరాబాద్ లో మరో గంటపాటు మోస్తరు వర్షం కురుస్తుందని, అర్థరాత్రి తర్వాత మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Next Story