- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా నదిలో తీవ్ర కాలుష్యం.. 113 గ్రామాలకు తాగునీరు బంద్
by Muthe.Rajitha |
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వ్యవసాయానికి, తాగునీటికి జీవనాధారమైన కృష్ణానది జలాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వ్యవసాయానికి, తాగునీటికి జీవనాధారమైన కృష్ణానది జలాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో మురుగు నీటిని నిర్లక్ష్యంగా నదిలోకి వదలడం, రాత్రివేళల్లో పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలను గుట్టుచప్పుడు కాకుండా కలపడం వల్ల కృష్ణా నీరు తాగునీటికి కూడా పనికిరాని స్థితికి చేరుతోంది. దీని ప్రభావంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గత 25 రోజులుగా 113 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాగునీరు, తాగునీటిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి కృష్ణానది పరిరక్షణ, ప్రక్షాళన, కాలుష్య నియంత్రణకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story





