- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఏఎస్‌ల స్థానంలో ఐపీఎస్‌లు.. సివిల్ సప్లయ్‌లో పాలనా వైఫల్యాలేనా?
సివిల్ సప్లయ్ కార్పొరేషన్ బాధ్యతలను ఐపీఎస్‌లకు అప్పగించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: (Civil Supply Corporation)సివిల్ సప్లయ్ కార్పొరేషన్ బాధ్యతలను (IPS) ఐపీఎస్‌లకు అప్పగించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో వారు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను చక్కదిద్దడంలోనూ వారు ఫెయిల్ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడంలోనూ ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. పాలనా వ్యవహారాల్లో శిక్షణతో పాటు అనుభవం ఉన్న ఐఏఎస్‌లకు కార్పొరేషన్ బాధ్యతలు అప్పగిస్తే కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఉద్యోగులు అంటున్నారు.
పోలిసింగ్‌కు బీఆర్ఎస్ శ్రీకారం
ఉమ్మడి రాష్ట్రంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కమిషనర్లుగా కేవలం ఐఏఎస్‌లను మాత్రమే నియమించేవారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత (BRS) బీఆర్ఎస్ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఐపీఎస్‌లకు కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించడం షురూ చేసింది. కానీ వారు ఆశించిన స్థాయిలో కార్పొరేషన్ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని విమర్శలున్నాయి. ఎందుకంటే ఐపీఎస్‌లకు ట్రైనింగ్ సమయంలో ప్రధానంగా సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ అంశాలపైనే ఎక్కువగా శిక్షణ ఇస్తుంటారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వ్యవహారాలు అందుకు భిన్నంగా ఉంటాయి. ధాన్యం సేకరణ సమయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలి. సేకరించిన ధాన్యం కోసం కావాల్సిన గోదాములను సమీకరించుకోవాలి. మిల్లింగ్ చేయించాలి. అదే సమయంలో స్టోర్‌లో ఉన్న ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా సంప్రదింపులు జరపాలి. ఈ వ్యవహారాలన్నింటినీ చూసుకోవడంలో ఐపీఎస్‌లు విఫలమవుతున్నట్టు విమర్శలున్నాయి.
ఐఏఎస్‌లకు క్షేత్ర స్థాయి అనుభవాలు
ఐఏఎస్‌లు జిల్లా కలెక్టర్లుగా పని చేసిన సమయంలో ధాన్యం సేకరణలో ఎదురయ్యే సమస్యలన్నీ వారు స్వయంగా చూస్తుంటారు. వాటిని పరిష్కరించేందుకు నాయకత్వం వహిస్తుంటారు. కార్పొరేషన్ బాధ్యతలు ఐఏఎస్‌లకు అప్పగిస్తే ఫీల్డ్‌లో ఎదురయ్యే సమస్యలను సులువుగా పరిష్కరించడంలో చొరవ చూపిస్తారు. అదే విధంగా అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉండటంతో సేకరించిన ధాన్యాన్ని స్టోరేజీ చేసేందుకు ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గోదాములను సమకూర్చేందుకు ప్లాన్ చేస్తుంటారు. మరోవైపు జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అంతా సాఫీగా జరిగేందుకు ఫోకస్ పెడుతుంటారని టాక్ ఉంది. కానీ ఐపీఎస్‌లు మాత్రం తమ దైన శైలీలో పోలీస్ లాగ్వేంజ్ ఉపయోగించడంతో కొన్ని సార్లు సమస్యలు ఎదురయ్యాయని క్షేత్ర స్థాయి అధికారులు గుర్తు చేస్తున్నారు.
మిల్లర్లను కంట్రోలింగ్ కోసమే..
ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని వెనక్కి ఇచ్చేందుకు మిల్లర్లు ఇప్పటికీ ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకే మిల్లర్లను కట్టడి చేసేందుకే ఐపీఎస్‌లకు కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించడం అనవాయితీగా కొనసాగుతుందని టాక్ ఉంది. ఇప్పటికీ మిల్లర్ల ఆగడాలు కంట్రోల్ కాలేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు ఉన్న రాజకీయ లాబియింగ్‌తో మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.






