- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rangarajan attack case : రంగరాజన్ పై దాడి కేసులో మరో ఏడుగురి అరెస్ట్
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్(Rangarajan )పై రామరాజ్యం ఆర్మీ పేరిట దాడి చేసిన కేసుకు (Attack Case)కు సంబంధించి మరో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు(Seven More Arrested) చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్(Rangarajan )పై రామరాజ్యం ఆర్మీ పేరిట దాడి చేసిన కేసుకు (Attack Case)కు సంబంధించి మరో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు(Seven More Arrested) చేశారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, భద్రాచలం ప్రాంతాలకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లుగా మొయినాబాద్ పోలీసులు(Moinabad Police) వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మొత్తం 18 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
రిమాండ్ రిపోర్టు మేరకు ఏపీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డి(Kovvuri Veera Raghava Reddy) తాను ఇక్షాకు వంశీయుడనని..రామరాజ్య స్థాపన ధ్యేయంగా కోసలేంద్ర ట్రస్టును ఏర్పాటు చేసి విరాళాల సేకరణ చేపట్టాడు. అలాగే రామరాజ్యం ఆర్మీ పేరుతో 30మంది వరకు సభ్యులను తన సైన్యంలో చేర్పించుకున్నాడు. హిందూ దేవాలయాల నిర్వహకులను, అర్చకులను కలుస్తూ తమ సిద్ధాంతానికి మద్ధతు తెలపాలని కోరాడు. ఎవరైనా తమను వ్యతిరేకిస్తే వారి అడ్డుతొలగించుకోవాలని కూడా తన సంస్థ సభ్యులతో ప్రతిజ్ఞ కూడా చేయించాడు.
10నెలల క్రితమై రంగరాజన్ ను కలిసిన వీరరాఘవరెడ్డి తమ రామరాజ్య స్థాపనకు మద్ధతివ్వాలని కోరాడు. అయితే రంగరాజన్ నుంచి స్పందన లేకపోవడంతో ఈనెల 4న, 6న తన న్యాయవాద మిత్రుడు దామోదర్ రెడ్డి సహకారంతో దమ్మాయిగూడలోని ఉదయ్ రెడ్డి నివాసంతో 21మందితో వీరరాఘవరెడ్డి భేటీ అయ్యారు. రంగరాజన్ మినహా మిగతా దేవాలయాల అర్చకులంతా తమకు మద్ధతునిచ్చేందుకు అంగీకరించారని వీరరాఘవ రెడ్డి తెలిపాడు. తమతో విబేధించిన రంగరాజన్ పై కోపంతో తన సైన్యంతో కలిసి ఆయనపై ఈనెల 7న వీరరాఘవరెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు 22మందిని నిందితులుగా చేర్చారు.






