అమెరికాలో కేసుల విముక్తికి సెటిల్‍మెంట్ ప్లాన్!.. కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు

by Prasad Jukanti |

అమెరికాలో క్రిమినల్ కేసుల ఎత్తివేతకు అదానీ 10 బిలియన్ల డాలర్లను ఆఫర్ చేశారనే వార్తలు సంచలనంగా మారాయి. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు.

అమెరికాలో కేసుల విముక్తికి సెటిల్‍మెంట్ ప్లాన్!.. కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరోసారి చర్చగా మారారు. అమెరికాలో తనపై నమోదైన క్రిమినల్ కేసు నుంచి బయటపడేందుకు ఆయన సెటిల్‍మెంట్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తనపై కేసు ఎత్తివేస్తే యూఎస్ లో పెట్టుబడులు పెడుతానని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బ్లూమ్ బర్గ్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు వెలువరించడం భారత వ్యాపార, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. టైమ్స్ ఆర్టికల్‍ను బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి ఎక్స్ లో పోస్టు చేయడం మరింత చర్చగా మారింది. యూఎస్‍లో సోలార్ పవర్ ఒప్పందాల కోసం భారత్ అధికారులకు అదానీ లంచం ఇచ్చారనఏ ఆరోపణలు ఉన్నాయి. ఈ ముడుపుల ఆరోపణలతో అమెరికాలో అదానీపై కేసు నమోదు అయింది. అయితే అదానీపై నమోదైన ఈ కేసు వల్లే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక అంశాల్లో ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.

10 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్.. 15,000 ఉద్యోగాల ఆఫర్

అయితే గత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఆఖరి రోజుల్లో నమోదైన ఈ కేసులో ట్రంప్ పాలనలో కీలక మలుపు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుల నుంచి బయటపడేందుకు ఆలోచిస్తున్న అదాని అమెరికాలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారని తనపై నమోదైన కేసు కొట్టేస్తే పెట్టుబడులను సిద్ధం అని ట్రంప్ ప్రభుత్వంతో అదానీ సెటిల్‍మెట్ చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. తన కేసును ట్రంప్‍కు అత్యంత సన్నిహితుడైన న్యాయవాదికి ఇచ్చారనే టాక్ ఉంది. ఈ మేరకు అదానీ తరపు న్యాయవాదులు అమెరికా ప్రభుత్వానికి ఒక అసాధారణమైన 'ఆర్థిక ప్రతిపాదన' చేసినట్లు ఈ మీడియా కథనాలు పేర్కొన్నారు. అదానీపై ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తివేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థలో అదానీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల (రూ. 84,000 కోట్ల పైమాటే) పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని, దీని ద్వారా 15,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతిపాదించినట్లు టాక్ వినిపిస్తోంది.

ఒక్కసారిగా పడిపోయిన అదానీ షేర్లు:

అమెరికా న్యాయస్థానంలో నమోదైన సివిల్ కేసుల సెటిల్మెంట్‌కు సంబంధించి వస్తున్న వార్తలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. గత ఒక నెల రోజులుగా భారీ ర్యాలీతో దూసుకుపోతున్న అదానీ స్టాక్స్.. ఇవాళ ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 5 శాతం వరకు పతనమయ్యాయి.

Next Story