కర్రిగుట్టలు సీఆర్పీఎఫ్ బలగాల హస్తగతం.. వాజేడులో బేస్ క్యాంప్ ఏర్పాటు

by Prasad Jukanti |   (  Updated:2025-11-25 11:11:51  IST  )

ర్రిగుట్టలపైకి రోడ్ వే ఏర్పాటు చేస్తామని సీఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ తెలిపారు.

కర్రిగుట్టలు సీఆర్పీఎఫ్ బలగాల హస్తగతం..  వాజేడులో బేస్ క్యాంప్ ఏర్పాటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పని చేస్తున్నామని కేంద్రం ప్రకటించిన వేళ మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రిగుట్టల విషయంలో భద్రతాబలగాలు మరో కీలక ముందడగు వేశాయి. ముగులు జిల్లా వాజేడు మండలం మోర్మూరు వద్ద ఇవాళ సీఆర్‍పీఎప్ మరో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన సీఆర్‍పీఎఫ్ 39 బెటాలియన్‍ను సీఆర్ పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్రిగుట్టలపై తమ తదుపరి లక్ష్యాన్ని వివరించారు. కర్రిగుట్టలపై అతితక్కువ కాలంలో పట్టు సాధించామని నక్సలిజం ఫ్రీ ఇండియా దిశగా ఇది మరో ఒక ముఖ్యమైన ముందడుగు అడుగు అన్నారు. ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. త్వరలో కర్రిగుట్టలపై రోడ్ వే ఏర్పాటు చేసి పైన కూడా సీఆర్‍పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కర్రిగుట్ట ప్రాంతంలో అభివృద్ది జరిగేలా ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కర్రిగుట్టలో 14 ఐఈడీలు:

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టలోని తడపల కొండల్లో ఏర్పాటు చేసిన ఎఫ్ఓబీ (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్) క్యాంపు బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి కర్రిగుట్టల్లో 14 ఐఈడీలను గుర్తించారు. కాగా మావోయిస్టుల ఏరివేతలో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్రిగుట్టలపై కేంద్ర బలగాలు ఫోకస్ పెట్టాయి. సుదీర్ఘ కాలంగా మావోయిస్టులకు పెట్టని కోటగా ఈ ప్రాంతం ఉండటంతో ఆపరేషన్ కగారులో భాగంగా భద్రతా దళాలు ఇటువైపు ఫోకస్ చెశాయి. ఈ ఏడాది జులైలో ఆపరేషన్ కర్రిగుట్టలు/ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు పేరుతో పేరుతో కర్రిగుట్టల కొండల చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాలు 21 రోజుల ఆరపరేషన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా 31 మంది నర్సల్స్ ను అంతమొందించాయి. ఈక్రమలోనే మే నెలలో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును ఎన్ కౌంటర్ చేయడం ఆపరేషన్ కగారులో భద్రతా దళాలు సాధించిన అతిపెద్ద విజయంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కర్రిగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు ఈ కర్రిగుట్టలను అష్టదిగ్బంధనం చేసే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన బలగాలు మరింత ముందుకు దూసుకుపోయేలా కొత్త బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటోంది.

Next Story