నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి ధర్మపురి సంజయ్ రాజీనామా!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-03 14:20:08  IST  )

నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి ధర్మపురి సంజయ్ రాజీనామా!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ మాజీ మేయర్, సీనియర్ నేత డీ.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంటున్నా, సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. పార్టీ అనుసరిస్తున్న కొన్ని విధానాలు, స్థానిక నాయకత్వంతో ఉన్న విభేదాలు కూడా ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. తన అనుచరులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఒత్తిడి చేయడంతో ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపారు.

నేడు తుది నిర్ణయం..

రాజీనామా అంశంపై చర్చించేందుకు ధర్మపురి సంజయ్ ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లో తన ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపే అవకాశం ఉంది. ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సోదరుడు కావడంతో, ఈ పరిణామం నిజామాబాద్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సంజయ్ తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీ.. తల్లిదండ్రుల బాధలు పట్టవా?: కవిత

Next Story