- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: త్వరలో ఆకస్మిక తనిఖీలు.. ఏటీసీ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి
త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా.. సమీక్షలో సీఎం కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రైజింగ్-2047 కు అనుగుణంగా ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో (Secretariat) అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి వివేక్ వెంకట స్వామి, సంబంధిత అధికారులు తదితరులు హాజరైన ఈ సమీక్షలో (Review on ATCs) ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతి వివరాలను సీఎం ఆరా తీశారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని సూచించారు. అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.
ఆకస్మిక తనిఖీలు చేస్తా:
ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ఏటీసీల పురోగతిపై సీఎంకు వివరించిన అధికారులు రాష్ట్రంలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఫేజ్-1 లో 25, ఫేజ్-2 లో 40, ఫేజ్-3 లో 46 ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటి వరకు ఫేజ్-1, ఫేజ్-2 లో 49 అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.






