KTR: ఫిరాయింపుపై నిర్ణయానికి స్పీకర్ కూ గడవు విధించాలి: కేటీఆర్

by Prasad Jukanti |   (  Updated:2025-04-13 05:51:53  IST  )

గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించినట్లుగానే ఫిరాయింపులపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్లకు డెడ్ లైన్ విధించాలని కేటీఆర్ అన్నారు.

KTR: ఫిరాయింపుపై నిర్ణయానికి  స్పీకర్ కూ గడవు విధించాలి: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లతో పాటు రాష్ట్రపతికీ గడువు విధించినట్లుగానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్లకు (Assembly Speaker) గడువు విధించాలని సుప్రీంకోర్టును (Supreme Court) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కోరారు. అసెంబ్లీ స్పీకర్లు రాజ్యాంగ ఉల్లంఘనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సరోన్నత న్యాయస్థానం గడువు విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లు లెక్కలేనన్ని సార్లు పాలనలో అవరోధాలు సృష్టించడానికి గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు.

కాగా, రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదం కోసం గవర్నర్లు తీవ్ర జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. గరిష్టంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, వెనక్కి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులు వెనక్కి పంపితే అందుకు సహేతుకమైన కారణాన్ని రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది.

Next Story