- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో వేధిస్తున్న సర్వర్ సమస్య
ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్‌కి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 1 నుండి 8 వరకు జరగనుంది.

X
- గుమిగూడుతున్న విద్యార్థులు
- హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయని అధికారులు
- స్లాట్ బుకింగ్ ఆలస్యం
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
- బహద్దూర్‌పురలోని కులికుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీలో 3 గంటల నుండి సర్వర్ ప్రాబ్లం
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్‌కి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 1 నుండి 8 వరకు జరగనుంది. ఈ నేపధ్యంలో కౌన్సెలింగ్‌కి హాజరైన విద్యార్థులకు పలు సెంటర్లలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.. స్లాట్ బుకింగ్‌లో సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి ఆలస్యం అవుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ ఏర్పాట్లలో అధికారుల అలసత్వం కనిపిస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులకు సందేహాలు, సలహాల కోసం ఏర్పాటు చేయాల్సిన హెల్ప్‌డెస్క్‌లు కూడా కొన్నిచోట్ల లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. బహద్దూర్‌పురలోని కులికుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీలో రెండు గంటల నుండి సర్వర్ మొరాయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






