- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ జిల్లాలో గాలిపటం మాంజాతో తీవ్ర ప్రమాదం.. గొంతు లోపల వరకు కట్!
by Ramesh Naini |
గాలిపటాల మాంజా నిర్లక్ష్యంతో మరో ప్రాణాపాయం తప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గాలిపటాల మాంజా నిర్లక్ష్యంతో మరో ప్రాణాపాయం తప్పింది. మేడ్చల్ జిల్లా కీసర మండలం మల్లికార్జున నగర్ కాలనీలో శుక్రవారం జరిగిన ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జశ్వంత్ రెడ్డికి మాంజా మెడకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి.
పొలం వద్దకు బైకుపై వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా మాంజా మెడకు చుట్టుకోవడంతో గొంతు లోపల వరకు గాయం అయింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుమారు 19 కుట్లు వేసి చికిత్స అందించారు.
ప్రస్తుతం బాలుడి పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గాలిపటాల కోసం ప్రమాదకరమైన మాంజా వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాంజా వాడకాన్ని నియంత్రించాలని, మాంజా తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story






