- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు.. డిప్యూటీ సీఎం భట్టికి వీహెచ్ కీలక రిక్వెస్ట్
హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి, 50 ఏళ్ల నాటి పాత కరెంట్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో పాతపడిపోయిన కరెంట్ వైర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (V Hanumanatha Rao) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు కొత్త వైర్లను వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డీప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka)కు కీలక సూచనలు చేస్తూ ఇవాళ లేఖ రాశారు.
ఆ లేఖలో హైదరాబాద్ సిటీలో 50 ఏళ్ల క్రితం వేసిన కరెంట్ వైర్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయని వీహెచ్ గుర్తుచేశారు. కొన్ని ప్రాంతాల్లోనైతే నిజాం (Nizam) కాలం నాటి పాత వైర్లు కూడా ఇంకా వాడుకలో ఉన్నాయని పేర్కొన్నారు. పాడైపోయిన కరెంటు వైర్ల కారణంగానే నగరంలో తరచూ షార్ట్ సర్క్యూట్లు, అగ్రి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ లేని వ్యాపారస్తులు, సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని వీహెచ్ తెలిపారు. కొత్త వైర్లను వేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, తద్వారా ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టాన్ని కూడా భారీగా తగ్గించవచ్చని వీహెచ్ లేఖలో ప్రస్తావించారు.






