ఫోన్ ట్యాపింగ్ కేసులో సెన్సేషనల్ ట్విస్ట్.. సుమోటోగా కేసు నమోదు చేసిన తెలంగాణ హైకోర్టు

by Satheesh |

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం తెలంగాణకు హైకోర్టుకు చేరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో

ఫోన్ ట్యాపింగ్ కేసులో సెన్సేషనల్ ట్విస్ట్.. సుమోటోగా కేసు నమోదు చేసిన తెలంగాణ హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం తెలంగాణకు హైకోర్టుకు చేరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ సెలబ్రెటీలు, రియల్టర్లు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఈ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, భుజంగారావు పోలీసులకు కన్ఫెషన్ రిపోర్ట్‌లో సెట్మెంట్లు ఇచ్చినట్లు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డ విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడంతో పాటు పేపర్ లీకేజీ కేసులో అప్పటి తెలంగాణ హైకోర్టు సీజే ఫోన్‌ను సైతం ట్యాప్ చేసినట్లు నిందితుడు భుజంగరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ వచ్చాయి.

దీంతో వార్త పత్రికల్లోని కథనాల ఆధారంగా తెలంగాణ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఈ సుమోటో పిటిషన్‌ను సీజే ధర్మాసనం విచారించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. తాజాగా హైకోర్టుకు చేరడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హై కోర్టు ఎంటర్ కావడంతో నెక్ట్స్ ఈ కేసులో ఏం జరగబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Next Story