Veera Raghava Reddy: వీరరాఘవరెడ్డి విచారణలో సంచలన విషయాలు !

by Y. Venkata Narasimha Reddy |

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడు రంగరాజన్(Rangarajan)పై దాడికి పాల్పడిన(Assault Case)రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు(Founder of Rama Rajyam Army) వీర రాఘవరెడ్డి(Veera Raghava Reddy)ని పోలీసులు విచారిస్తున్న పలు సంచలన విషయాలు(Sensational things) వెలుగులోకి వచ్చాయి.

Veera Raghava Reddy: వీరరాఘవరెడ్డి విచారణలో సంచలన విషయాలు !
X

దిశ, వెబ్ డెస్క్ : చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడు రంగరాజన్(Rangarajan)పై దాడికి పాల్పడిన(Assault Case)రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు(Founder of Rama Rajyam Army) వీర రాఘవరెడ్డి(Veera Raghava Reddy)ని పోలీసులు విచారిస్తున్న పలు సంచలన విషయాలు(Sensational things) వెలుగులోకి వచ్చాయి. వీరరాఘవ రెడ్డికి కోర్టు విధించిన మూడు రోజుల పోలీసుల కస్టడీ నేటితో ముగిసిపోనుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న విచారణలో వీరరాఘవరెడ్డి రామరాజ్యం వ్యవస్థాపన, రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.

తాను పదో తరగతి వరకు మాత్రమే చదివినా.. చట్టాలపై, మత గ్రంథాలపై విస్తృతంగా అవగాహన పెంచుకున్నానని వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. రామరాజ్యాన్ని ఎందుకు స్థాపించాలనుకున్నావని పోలీసులుప్రశ్నించగా..2015లో జరిగిన ఓ ఘటనను వీరరాఘవరెడ్డి కారణంగా చెప్పాడు. తన రెండో తరగతి చదువుతున్న బిడ్డను మూడో తరగతికి ప్రమోట్ చేయకుండా డీటైన్ చేశారని.. దీనిపై అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వివరించాడు. ఈ అన్యాయాన్ని చూసి సమాజాన్ని మార్చాలని, రామరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు చెప్పాడు.

ప్రధానంగా రంగరాజన్ పై దాడి చేయడం తప్పేనని వీరరాఘవరెడ్డి అంగీకరించి తన చర్యల పట్ల పశ్చాత్తాపం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో దాడికి దారితీసిన పరిస్థితులను వివరించిన వీర రాఘవరెడ్డి తన చర్యను సమర్థించుకోవడం లేదని స్పష్టం చేశాడు. తన వెంట వచ్చిన అనుచరుల ముందు తనను రంగరాజన్ చిన్నబుచ్చారని, అందుకే అసహనంతో దాడికి దిగాల్సి వచ్చిందని వెల్లడించాడు. రామరాజ్యం స్థాపన కోసం ఇకపై శాంతియుతంగా పనిచేస్తానని చెప్పాడు. నేటితో వీర రాఘవరెడ్డి కస్టడీ ముగియనుండడంతో పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు. ఈ కేసులో ఇంకేవరికైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేయనున్నారు.

Next Story