HCA అక్రమాలపై సంచలన నివేదిక

by Muthe.Rajitha |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయిన సంగతి తెలిసిందే.

HCA అక్రమాలపై సంచలన నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్(Vigilance and Enforcement Department) తో విచారణకు ఆదేశించారు. కాగా విచారణ పూర్తిచేసిన విజిలెన్స్ అధికారులు తమ నివేదికను సీఎంకు అందజేశారు. అయితే ఈ నివేదికలో సంచలన నిజాలు ఉన్నట్టు సమాచారం. HCA ఐపీఎల్ 2025 టికెట్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

హెచ్సీఎ సెక్రటరీ, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీపై ఒత్తిడి చేసి, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో(Uppal Stadium) జరిగే మ్యాచ్‌లకు ఇప్పటికే 10 శాతం(3,900 టికెట్లు) ఉచితంగా ఇస్తున్నా.. మరో 10 శాతం టికెట్లు కూడా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విజిలెన్స్ నిర్ధారించింది. ఈ విషయంలో SRH యాజమాన్యం హెచ్సీఎ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలు చేసింది. మార్చి 27న SRH-LSG మ్యాచ్ రోజున హెచ్సీఎ ఒక కార్పొరేట్ బాక్స్(F3)ను లాక్ చేసి, అదనంగా 20 టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేసిందని SRH ఆరోపించింది.

ఈ ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కోటకోట శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో హెచ్సీఎ అక్రమాలు, టికెట్ల దుర్వినియోగం, అధిక ధరలకు విక్రయించడం వంటి విషయాలు ధృవీకరించారు. కాగా ఏప్రిల్ 2న హెచ్సీఎ, సన్ రైజర్స్ మధ్య చర్చలు జరిగి, 3,900 టికెట్ల ఒప్పందాన్ని కొనసాగించడానికి రెండు పక్షాలు అంగీకరించాయి. హెచ్సీఎ ఇకపై ఒత్తిడి చేయదని హామీ ఇచ్చింది.

Next Story