- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంచ గచ్చిబౌలి (HCU) భూములపై సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలీ (హెచ్‌సీయూ) భూముల వేలం.. సుప్రీం కోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ భూముల వేలంపై విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలీ (HCU) భూముల వేలం.. సుప్రీం కోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ భూముల వేలంపై విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు (Political parties) తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయం (Government decision)పై పలువురు తెలంగాణ హైకోర్టు తో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వాటా ఫౌండేషన్(Vata Foundation) హైకోర్టులో పిల్(PIL) దాఖలు చేసింది. ఈ భూమిలో ప్రభుత్వ వేలాన్ని నిలిపివేయాలని, వన్యప్రాణులకు ఆవాసమైన ఆ స్థలాన్ని జాతీయ పార్కు గా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. ఈ పిల్ పై బుధవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టి.. ఈ రోజు వరకు చెట్ల నరికివేతలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు (Supreme Court)లో ఈ వ్యవహారంపై నమోదైన పిటిషన్ (Petition)పై విచారించిన కోర్టు.. కంచ గచ్చిబౌలి భూములపై సంచలన ఆదేశాలు (Sensational orders) జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు రిపోర్టు ఆందించాలని తెలంగాణ హైకోర్టు రిజిష్టార్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ (Supreme Court issued orders) చేసింది. అలాగే తదుపరి ఉత్తర్వులు (Further orders) ఇచ్చే వరకు గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ సీఎస్ (Telangana CS)కు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే 400 ఎకరాల భూమి 30 ఏళ్లుగా వివాదంలో ఉందని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే హెచ్ సీయూ (HCU)లో ఉన్న ఆ భూమి అటవీ భూమి అని ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.






