- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
srusti case: తెలిసే తప్పులు చేశాం.. పోలీసుల విచారణలో డా.నమ్రత సంచలన విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Srishti Fertility Centre) కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల కస్టడీలో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత (Dr.Nammata) తన తప్పును అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘సృష్టి’ లో అక్రమాలు నిజమేననని, తెలిసే ఈ తప్పులు చేశామని పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. రాజస్థాన్ దంపతులను సరోగసి చేసినట్లు నమ్మించామని పోలీసుల ముందు ఆమె ఒప్పుకున్నట్లు తెలిసింది.
కాగా, ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డా. నమ్రతను సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు. కోర్టు అనుమతితో ఆమెను కస్టడిలోకి తీసుకుని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. అయితే పిల్లలు లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వహకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






