వికారాబాద్‌ బోటు ప్రమాదంలో వెలుగులోకి సంచలన విషయాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-06 08:29:53  IST  )

వికారాబాద్ లోని సర్పన్ పల్లి ప్రాజెక్ట్ సమీపంలో వెల్డర్ న్నెస్ అనే రిసార్ట్ కు వచ్చిన పర్యాటకులు.. దాని వెనుక ఉన్న సర్పన్ పల్లి చెరువులో బోటింగ్ కు వెళ్లారు.

వికారాబాద్‌ బోటు ప్రమాదంలో వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ లోని సర్పన్ పల్లి ప్రాజెక్ట్ సమీపంలో వెల్డర్ న్నెస్ అనే రిసార్ట్ కు వచ్చిన పర్యాటకులు.. దాని వెనుక ఉన్న సర్పన్ పల్లి చెరువులో బోటింగ్ కు వెళ్లారు. ఈ క్రమంలో బోట్ నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు మహిళలు రీటా కుమారి (55), పూనం సింగ్ (56) అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ది వైల్డర్‌ నెస్‌ రిసార్ట్‌ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని, బోటింగ్ కు కూడా అనుమతులు తీసుకోలేదని దర్యాప్తులో తేలింది. బోటింగ్ నిర్వాహకులు టూరిస్టులకు లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వడం లేదని, వారి ప్రాణాలే పెట్టుబడిగా వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా, అనుమతులు లేకుండా చెరువులో బోటింగ్ నిర్వహిస్తున్న విషయం వెల్లడి కావడంతో.. పోలీసులు రిసార్టు, బోటింగ్ నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story