సీఎం రేవంత్‌ది మా రక్తమే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది తమ రక్తమేనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్‌ది మా రక్తమే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది తమ రక్తమేనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సీఎం రేవంత్ రక్తం ఇంత త్వరగా మారుతుందని అనుకోలేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ఎంఐఎం(MIM)కు కొమ్ము కాస్తున్నారని విమర్శలు చేశారు. అందుకే హిందూ కార్యకర్తలపై లాఠీచార్జీ జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ఉంటాయన్నారు. ఎంఐఎం ఐఎస్ఐకి ఆర్థికసాయం అందిస్తోందని ఆయన ఆరోపించారు.

ఎంఐఎం ఆఫీస్ కింద గ్రానైట్స్ దొరికిన సంఘటనలు లేవా? అని ఆయన గుర్తుచేశారు. ఎంఐఎం.. ఐఎస్ఐను పెంచి పోషిస్తోందన్నారు. ఓల్డ్ సిటీని మినీ పాకిస్తాన్‌గా ఎంఐఎం మార్చిందని రాజాసింగ్ విమర్శలు చేశారు. మునావర్ జామ స్పీచ్‌తోనే ముత్యాలమ్మ దేవాలయంపై దాడి జరిగిందన్నారు. ఆయనను అరెస్ట్ చేశారా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆయనకు, ఐసీస్ కు మధ్య ఉన్న సంబంధమేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓపెన్ గా లవ్ జిహాద్ కేసులు ఎక్కువవుతున్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు.

Next Story