రేవంత్ సర్కార్ పట్టించుకోకపోతే.. కేంద్రమే రంగంలోకి దిగి పీక నొక్కే ప్రయత్నం చేస్తది!

by Gantepaka Srikanth |

తెలంగాణలో శాంతిభద్రతలకు ఎవరైనా హానీ కలిగించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) హెచ్చరించారు.

రేవంత్ సర్కార్ పట్టించుకోకపోతే.. కేంద్రమే రంగంలోకి దిగి పీక నొక్కే ప్రయత్నం చేస్తది!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో శాంతిభద్రతలకు ఎవరైనా హానీ కలిగించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాగం కలిగించేవారికి చట్టపరంగా కఠిన శిక్ష పడేవరకూ పోరాటం చేస్తామని అన్నారు. రోహింగ్యాలకు తెలంగాణలో స్థానం లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రోహింగ్యాలపై దృష్టి పెట్టి పరిష్కరించకపోతే.. కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి.. సరైన సమాచారం తెప్పించుకొని పీక నొక్కే ప్రయత్నం చేస్తదని కీలక వ్యాఖ్యలు చేశారు.

అందాలు పోటీలతో పాటు ఇంకేం కాంపిటీషన్స్ నిర్వహించుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కానీ చట్ట వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి 17 నెలలు గడుస్తోందని.. ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. తక్షణమే ముందే ప్రకటించిన విధంగా ప్రతీ గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్‌(Congress)లు కేంద్రం నిందులు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు.

Next Story