BRS: ఏడాది క్రితమే ఆహ్వానించారు.. కాంగ్రెస్ ఘర్ వాపసీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఘర్ వాపసీ పిలుపు సంచలనంగా మారింది.

BRS: ఏడాది క్రితమే ఆహ్వానించారు.. కాంగ్రెస్ ఘర్ వాపసీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకునేందుకు ఘర్ వాపసీ (Ghar Wapsi) కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ (Congress) చేసిన ప్రకటన స్టేట్ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో త్వరలో జూబ్లీహిల్స్ బై పోల్, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న నేతలు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (BRS MLA Sudhir Reddy) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనను ఏడాది క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. పాత నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం కొత్తేమి కాదన్నారు.

టీడీపీ నేతలు వెళ్లిపోతారా?

కాంగ్రెస్ ను వీడిన పాత నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పాత టీడీపీ నేతలు కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోతారా అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. తాము బీఆర్ఎస్ ను వదిలే సమస్యే లేదని బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలే తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. కేసీఆర్ సరేనంటే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వచ్చేస్తారన్నారు.

Next Story