- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 మంది ఎమ్మెల్యేల గెలుపు వెనుక మార్వాడీల డబ్బులు : తెలంగాణ విఠల్ సంచలన ఆరోపణలు
తెలంగాణలో "మార్వాడీ గో బ్యాక్" ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో తెలంగాణ విఠల్ పలు సంచలన ఆరోపణలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో "మార్వాడీ గో బ్యాక్" ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో తెలంగాణ విఠల్ పలు సంచలన ఆరోపణలు చేసారు. తెలంగాణ ఎన్నికలపై మార్వాడీల డబ్బు గణనీయమైన ప్రభావం చూపిందని, అన్ని ప్రధాన పార్టీలకు వారి నుంచి కోట్లాది డబ్బు అందిందని తీవ్ర ఆరోపణలు చేసారు. అందువల్లే మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. దాదాపు 30 మంది తెలంగాణ ఎమ్మెల్యేల గెలుపు వెనుక మార్వాడీలు డబ్బులు ఉన్నాయని విఠల్ అన్నారు.
మార్వాడీల గోడౌన్లలో ఉన్న వేల కోట్ల డబ్బు ఎన్నికల్లోకి ప్రవహించిందని, అందుకే అంతా నోరు మూసుకొని ఉంటున్నారని మండిపడ్డారు. చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వాళ్ళ భూములను మార్వాడీలకు రాసిచ్చారని, త్వరలోనే వారి పేర్లు బయట పెడతానని అన్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఊపిరి పోసుకుంటున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి విఠల్ వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోసినట్టు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటె ఇటీవల కొంతమంది మార్వాడీ పెద్దలు పలు మీడియా ఛానెల్స్ లో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం గురించి మాట్లాడుతూ.. తాము లేకుండా తెలంగాణలో ఏ ఎలక్షన్ కానీ, ఏ ఉద్యమం కానీ నడవలేదని, మేము అందరికీ సహాయం చేశామని, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని పేర్కొనడం కూడా విఠల్ ఆరోపణలు నిజమేనేమో అనిపిస్తున్నాయి.






