- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మందకృష్ణ మాదిగ బీజేపీ తొత్తు’.. MRPS నాయకురాలు సంచలన ఆరోపణలు

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మందకృష్ణ.. నువ్వు ఎంఆర్‌పీఎస్ నాయకుడివి కాదు.. బీజేపీ తొత్తువు’ అని ఎంఆర్‌పీఎస్ నాయకురాలు మేరీ మాదిగ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ జాతి మొత్తాన్ని బీజేపీకి అమ్మకానికి పెట్టాడని ఆరోపించారు. మాదిగల పేరు మీద వందల కోట్లు సంపాదించావని విమర్శించారు. అమరుల పేరు మీద కూడా డబ్బులు వసూలు చేసాడని కీలక ఆరోపణలు చేశారు. దశాబ్దాల వర్గీకరణ ఆకాంక్ష నెరవేర్చిన మంత్రి దామోదర రాజనర్సింహను అకారణంగా దూషించడం సరైంది కాదన్నారు.
‘నీ కుట్రలను, నక్కజిత్తులను నమ్మి ఇకపై మాదిగలు మోసపోరు.. ఇంకా ఇలాగే మాట్లాడితే నిన్ను అభిమానించిన మాదిగలే, బట్టలూడదీసి నిన్ను తరిమికొడ్తరు.. ఎంతోమంది ఉద్యమకారులను నమ్మించి, గొంతు కోసిన దళారివి నువ్వు..” అని వ్యాఖ్యానించారు. నీలాంటి వ్యక్తికి దామోదర రాజనర్సింహ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఆయన జాతికి మేలు చేస్తున్నాడే తప్ప, ఇసుమంత కూడా కీడు చేయడం లేదని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను ఒప్పించి, మెప్పించి కోర్టు తీర్పు వచ్చిన 8 నెలల్లోనే వర్గీకరణ ఆకాంక్ష నెరవేర్చారని, ఈరోజు యావత్ మాదిగ జాతి సంబురాలు చేసుకుంటుంటే మందకృష్ణ నువ్వు ఓర్వలేకపోతున్నాడని దుయ్యబట్టారు.