- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ఆ ఇద్దరి కన్ను.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం షేక్‌పేట్ శివాజీ విగ్రహం వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) రోడ్ షో నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం షేక్‌పేట్ శివాజీ విగ్రహం వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్, కేటీఆర్ కన్ను పడిందని సంచలన ఆరోపణలు చేశారు. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కంప్లయింట్ కాపీ పంపిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డికి రోషం, పౌరుషం ఉంటే గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు చెబుతుంటే.. నన్ను మతతత్వవాది అంటున్నారని ఫైర్ అయ్యారు. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడనని అన్నారు. 80 శాతం మంది హిందువులారా.. మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు పువ్వు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.
హిందువులు వర్సెస్ ముస్లింల మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కలిసి ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.. కాంగ్రెస్ నేతలు ముస్లింలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు అవకాశమిస్తే జూబ్లీహిల్స్‌కు చేసిందేమీ లేదు.. అందుకే ఈసారి బీజేపీ అవకాశం ఇవ్వాలని కోరారు. కేటీఆర్ నెంబర్ వన్ చోర్ అని ఫైర్ అయ్యారు. ముడుతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకునే తిరిగే కేటీఆర్‌కు వేల కోట్లు ఎట్లా వచ్చాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో వేల మంది రైతులు చనిపోయిన సంగతి మర్చిపోదామా? అని జూబ్లీహిల్స్ ఓటర్లకు అడిగారు. కాంగ్రెస్ మన ఇండ్ల మీదకు హైడ్రాను పంపుతోంది.. ఇప్పటివరకు అనేక హిందువుల ఇళ్లు కూల్చేసింది.. ఇదంతా మర్చిపోదామా? అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిన నీచులు.. జూబ్లీహిల్స్‌ను ఎలా బాగు చేస్తారని అన్నారు. బీజేపీని గెలిపిస్తే అయోధ్య నుండి పూజారులను పిలిపించి పెద్దమ్మ గుడిని కట్టిస్తా అని బండి సంజయ్ ప్రకటన చేశారు. అమిత్ షాను పిలిపించి పూజలు చేయిస్తానని చెప్పారు.






