- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్కాజ్ గిరిలో కాల్పుల కలకలం..భార్యను కాల్చి చంపిన భర్త
మల్కాజ్‌గిరిలో కుటుంబ కలహాలతో భార్య నిషారాణిని భర్త అరుణ్ కాల్చి చంపాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: మల్కాజ్‌గిరిలో బుధవారం తెల్లవారుజామున కాల్పల కలకలం చెలరేగింది. మల్కాజిగిరి పరిధిలోని మారుతినగర్‍లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. మృతురాలిని నిషారాణిగా, నిందితుడు ఆమె భర్త అరుణ్‌గా గుర్తించారు. ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్ర మనస్పర్థలు, విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని నిషారాణికి అరుణ్ చెప్పాడు. ఆమెను నమ్మించి, తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. ఈ క్రమంలో అరుణ్ తన వద్ద దాచుకున్న తుపాకీ తీసి భార్య నిషారాణిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిషారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మూడు నెలల క్రితం పోలీసులకు చిక్కి..
ఈ కాల్పుల వెనుక కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. తన రెండో భార్యను హత్య చేసేందుకు అరుణ్ కుమార్ రెండు నెలల క్రితం కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అరుణ్ గత మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో తుపాకీతో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. అంబర్ పేటలో నిర్వహించిన వాహనతనిఖీల్లో ఒక తుపాకీ, 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడింతారు. మాల్కాజిగిరికి చెందిన అరుణ్ కుమార్ తన రెండవ భార్యను హత్య చేయడానికి బిహార్ నుంచి ఈ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాజాగా భార్యను చంపడానికి ఇపయోగించిన తుపాకీ గతంలో పోలీసులకు పట్టుబడ్డదేనా లేక మరో తుపాకీతో కాల్పులు జరిపాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






