గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నం..

by Kodari Anjali |

గోవిందాపురం గ్రామంలో తాటి రమేష్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది.

గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నం..
X

దిశ, పినపాక: మండల పరిధిలోని గోవిందాపురం గ్రామంలో తాటి రమేష్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. వివరాలలోకి వెళితే... గోవిందాపురం గ్రామానికి చెందిన తాటి జంపయ్య కుమారుడు తాటి రమేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా తన విధులు పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి 8mm ఇనుప కడ్డీతో ఛాతిపై హఠాత్తుగా దాడిచేసినట్లు రమేష్ తెలిపాడు. వెంటనే తేరుకొని కుటుంబసభ్యులతో ప్రతిఘటించడంతో పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనలో బాధితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇట్టి సంఘటనపై ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడి కుటుంబసభ్యులు తెలిపారు.

Next Story