ఆమె చేసిన చిన్న సహాయమే నాలో ఒక కొత్త మార్పునకు కారణమైంది.. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

అయితే ఒకరోజు నా బాధలను పంచుకుంటున్న సమయంలో నేను సాయి పల్లవితో మాట్లాడాను. ఆమె వెంటనే తన వద్ద ఉన్న వాటర్ కలర్స్‌ను నాకు ఇచ్చింది.

ఆమె చేసిన చిన్న సహాయమే నాలో ఒక కొత్త మార్పునకు కారణమైంది.. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమమ్’ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మంచి బ్రేక్ అందుకున్నారు. ఆ సినిమాలో వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించకపోయినప్పటికీ, హీరో జీవితంలోని వేర్వేరు దశల్లో వచ్చే పాత్రలలో నటించారు. అప్పటి నుండి వీరి మధ్య ఉన్న మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇక మళ్లీ కలిసి నటించనప్పటికీ నిత్యం ఒకరికి ఒకరు అండగా ఉంటున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. టచ్‌లో ఉంటున్నారు. తాజాగా.. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను స్వయంగా వేసిన పెయింటింగ్స్ కలెక్షన్‌ను అందరికీ చూపించారు. తాను వేసిన చిత్రాల గోడ ముందు నిలబడిన ఒక ఫోటోను అనుపమ షేర్ చేస్తూ.. "ఈ పెయింటింగ్స్ అన్నీ నా జీవితంలోనే అత్యంత కష్టమైన కాలం అయిన 2021లో వేసినవి.

చిన్నప్పటి నుండి నాకు రంగులంటే ఇష్టం ఉన్నా, పెయింటింగ్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఒకరోజు నా బాధలను పంచుకుంటున్న సమయంలో నేను సాయి పల్లవితో మాట్లాడాను. ఆమె వెంటనే తన వద్ద ఉన్న వాటర్ కలర్స్‌ను నాకు ఇచ్చింది. ఆ చిన్న సహాయమే నాలో ఒక కొత్త మార్పునకు కారణమైంది. నాకు తెలియని నాలోని సరికొత్త కోణాన్ని నాకు పరిచయం చేసినందుకు సాయి పల్లవికి చాలా థాంక్స్. లవ్ యూ డార్లింగ్" అంటూ అనుపమ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ పెయింటింగ్స్ అన్నింటినీ ఫ్రేమ్ కట్టించి, తన స్టూడియో గోడపై అలంకరించిన తన తల్లిదండ్రులకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇక అనుపమ పోస్ట్‌ చూసిన సాయి పల్లవి స్పందిస్తూ.. "లవ్ యూ మై బేబీ.. నీ పెయింటింగ్స్ చాలా పర్సనల్‌గా, ఎంతో అందంగా ఉన్నాయి. నీలోని టాలెంట్ ఇలా బయటకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అనుపమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Next Story