రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. మంత్రి ఉత్తమ్‌‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. మంత్రి ఉత్తమ్‌‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేసింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసిన నేపథ్యంలో ఉత్తమ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, కేసులో విచారణకు ఉత్తమ్ హాజరుకాకపోవడంతో తాజాగా ఆయనపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అదేవిధంగా తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేస్తూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story