- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేల అనర్హత కేసులో సంచలనం.. స్పీకర్‌కు సుప్రీం ధర్మాసనం సంచలన ఆదేశాలు
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీవివేకానంద, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనాసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది.
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించోద్దని కోర్టు కామెంట్ చేసింది. సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘అపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అనే సూత్రం వర్తించకూడదని ఫన్నీ కామెంట్ చేసింది. ఈ వ్యవహరంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా డిస్మిస్ చేసింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాకే స్పీకర్ నోటీసుల ఇచ్చారని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కామెంట్ చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం కాదన్నారు. విచారణను ఎమ్మెల్యేలు పొడిగించేందుకు ప్రయత్నిస్తే.. స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కాగా, మహారాష్ట్రకు సంబంధించిన కేసులోనూ సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పునే వెలువరించినా.. ఆ తీర్పు ఇప్పటి వరకు అమలు కాకపోవడం గమనార్హం.
కోర్టులో ఇరు పక్షాల వాదనలు ఇలా..
గత విచారణలో అభిషేక్ మనుసింఘ్వీ తన వాదలను వినిపిస్తూ.. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ ‘మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటని సింఘ్వీని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాట్లాడిన మాటలను కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి ప్రస్తావించారు. ‘ఉప ఎన్నికలు రావు.. స్పీకర్ తరఫున కూడా చెబుతున్నా’ అంటూ ఆయన వ్యాఖ్యానించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారని చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా.. ఆయన అలా వ్యవహరిస్తే ఎలా అని ధర్మాసనం సీరియస్ అయింది. ఇక అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా... సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ కామెంట్ చేశారు. తాము సంయమనం పాటిస్తున్నామని.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీం ధర్మాసనం చివరగా ఏప్రిల్ 3న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసింది.






