- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Doctors Strike: జూలై 1 నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె.. టీఎస్ఆర్‌డీఏ
తెలంగాణ వ్యాప్తంగా జూలై 1 నుంని సమ్మెకు సిద్ధమైనట్లు (TSRDA) సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Doctors Strike) తెలంగాణ వ్యాప్తంగా జూలై 1 నుంని సమ్మెకు సిద్ధమైనట్లు (TSRDA) సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (Telangana Senior Resident Doctors Association) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల సేవలు నుంచి వైదొలుగుతామని సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు. తమ డిమాండ్స్ నెరవేరిన తర్వాతనే సమ్మెను విరమిస్తామని తెలిపారు. పెండింగ్ స్టైఫండ్ అంశాలతో పాటు వాటి పెంపుదల అంశాల పైన ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా స్పందన లేదని సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఆగ్రహంగా ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు గత మూడు నెలలుగా స్టైఫండ్ (Stipend) చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న స్టైయిఫండ్ పెంపు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, అదేవిధంగా రెసిడెంట్‌ల ఉద్యోగ కాలాన్ని కొనసాగించేందుకు ఎక్స్‌టెన్షన్ జీవో ఇంకా విడుదల చేయలేదని చెప్పుకొచ్చారు.






