రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ లేఖ

by Malleboina Mahesh |

బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలి. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ లేఖ.

రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని రాహుల్ గాంధీకి లేఖ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు శనివారం లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని, ఆయన బిల్లు పెట్టకపోతే ప్రతిపక్షాలు ప్రయోజనం పొందుతాయన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని విమర్శలు చేస్తారని, రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేలా చూడాలని ఖర్గే, రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ కి లేఖ రాసినట్లుగా వీహెచ్ తెలిపారు.

రాహుల్ గాంధీ బీసీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందిన పొందకపోయినా బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఈ బిల్లు పెట్టాలని ఆయన సూచించారు. రాజ్యాంగంలోని 9 షెడ్యూల్ సవరిస్తేనే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం అవుతుందని, మోడీ బీసీ అయినా బీసీలకు న్యాయం చేయడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో ధర్నా కూడా చేసినట్లగా వీహెచ్ చెప్పారు. భద్రాచలం తెలంగాణలో ఉంటే ఢిల్లీ తెలంగాణ భవన్ లో శ్రీరాముని కళ్యాణం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో శ్రీరాముని కళ్యాణం జరపాలని సీఎంని కోరనున్నట్లగా ఆయన తెలిపారు.

Next Story