బీబీసీ డాక్యుమెంటరీపై వీహెచ్ హాట్ కామెంట్స్

by Disha Web Desk 2 |
బీబీసీ డాక్యుమెంటరీపై వీహెచ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2002 గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని రూపొందించిన బీబీసీని బ్యాన్ చేయాలని అనడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అన్నారు. బీబీసీ వాస్తవాల్ని చూపిందని చెప్పారు. మనది ప్రజాస్వామ్యమా లేక డిక్టేటర్ దేశమా? అని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అని విమర్శలు చేశారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం విషయంలో మరోసారి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మూడున్నరేళ్లుగా అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం చేస్తున్నామని అయినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. జై భీమ్ నాయకులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూల్చివేయడంతో పాటు ఆనాడు తాను తీసుకొచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పోలీసులు తీసుకుపోయారని ఆరోపించారు. ఎన్ని పోరాటాలు చేసినా తమ విగ్రహం ఇవ్వడం లేదని మండిపడ్డారు. జ్యోతిరావు పూలే ఆడిటోరియం విషయంలో కేటీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు.



Next Story

Most Viewed