VH: ఎదురు తిరగకపోతే మన పరిస్థితి వందేళ్ళు అయినా ఇంతే

by Gantepaka Srikanth |

జనగణనలో కులగణన లేదని, ఓబీసీ కాలమ్ ఉండాలి.. కులగణన లేకుంటే జనగణన ఎందుకు? కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హన్మంతరావు ప్రశ్నించారు.

VH: ఎదురు తిరగకపోతే మన పరిస్థితి వందేళ్ళు అయినా ఇంతే
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణనలో కులగణన లేదని, ఓబీసీ కాలమ్ ఉండాలి.. కులగణన లేకుంటే జనగణన ఎందుకు? కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హన్మంతరావు ప్రశ్నించారు. బీసీ ఇష్యూ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్తానని ఆయన అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. తమ లెక్కలు తెలియకపోతే మా బీసీలు రాజకీయాల్లో ఎలా పెరుగుతారని, బీసీ సంఘాలకి పిలుపునిస్తున్నా.. ఇప్పుడు ఎదురు తిరగకపోతే మన పరిస్థితి వందేళ్ళు అయినా ఇంతే అని ఆయన అన్నారు. బీజేపీకి చిత్తశుద్ది వుంటే అందరి లెక్కలను చేపట్టాలని, మా ఓట్లతోనే గెలుస్తారు...మాకు అన్యాయం చేస్తారా? అని ఆయన నిలదీశారు. కులగణన అంశాన్ని రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, రాహుల్ గాంధీని తాను కలిసి మీరు తెలంగాణకి రావాలని చెప్పినట్లుగా వీహెచ్ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తున్నందుకు రేవంత్ ప్రభుత్వని అభినందిస్తున్నట్లుగా ఆయన అన్నారు.

Next Story