- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hanumantha Rao: సీఎం చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు (V Hanumantha Rao) టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)ని కలిశారు. తాజాగా విజయవాడలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఏపీలోని ఒక జిల్లాకు దివంగత నేత, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత సీఎం దామోదరం సంజీవయ్య (Damodaram Sanjivayya) పేరును పెట్టాలని, అదేవిధంగా స్మృతివనం నిర్మించాలని వీహెచ్ కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయతీపరుడని వీహెచ్ పేర్కొన్నారు. కాగా, ఈ భేటీలో వారు తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. 3 దశాబ్దాల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా కలిశారు. తను రచించిన "ప్రపంచ చరిత్ర" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి దగ్గుబాటి ఆహ్వానించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కూడా ఆయన ఆహ్వానం అందించారు.






