వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు?

by Disha Web |
వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ సీఎం టంగుటూరి అంజయ్య 36వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్ వద్ద గల ఆయన విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి నివాళి అర్పించిన లక్ష్మయ్య సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడే అని ధ్వజమెత్తారు. అక్రమంగా వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగిస్తున్నారని ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు. టంగుటూరి అంజయ్య కార్మికుల పక్షపాతి అని కొనియాడారు.


Next Story