- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టే.. రైతన్నలకు తెలంగాణ పోలీసుల అలర్ట్
సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాల కొనుగోలులో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాల కొనుగోలులో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు (Telangana Police) సూచించారు. నకిలీ, కల్తీ విత్తనాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం నాడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ పోలీస్ అధికారిక ఖాతా ద్వారా రైతులకు పలు కీలక సూచనలు చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ఉండేందుకు, అలాగే కల్తీ వ్యాపారుల ఆటకట్టించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరైనా అమాయక రైతులను మోసం చేస్తూ కల్తీ విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠినమైన ‘పీడీ యాక్ట్’ (PD Act) నమోదు చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
పోలీసులు చేసిన సూచనలు ఇవే..
కల్తీ విత్తనాల విషయంలో రైతులు, ప్రజలు అస్సలు ఉదాసీనంగా ఉండకూడదు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే తక్షణమే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు విడిగా (లూజుగా) అమ్మే విత్తనాలను కొనుగోలు చేయకండి. నకిలీల భరతం పట్టడంలో, వారిని పట్టుకోవడంలో ప్రజలు కూడా పోలీసులతో భాగస్వాములు కావాలి. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, తద్వారా నష్టాల బారిన పడకుండా జాగ్రత్తపడాలని పోలీసులు ఈ పోస్టర్ ద్వారా అవగాహన కల్పించారు.






