- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills: జూబ్లీహిల్స్ లో పార్టీల ఎత్తుకు పై ఎత్తు.. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ తో పాటు కొత్త టెన్షన్!
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పొలిటికల్ హీట్ పెంచుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Poll) ఆసక్తిగా మారింది. ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్పీడ్ పెంచాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణినే బరిలోకి దింపబోతున్నట్లు హింట్ ఇచ్చింది. దీంతో కాగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కారు పార్టీకి డ్యాష్ ఇచ్చామని ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ అదే రిపీట్ చేసి గట్టి షాక్ ఇవ్వాలని అధికార కాంగ్రెస్ చూస్తోంది. ఇక కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదని ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈక్రమంలో ప్రధాన పార్టీల మధ్య ఎత్తుకు పై ఎత్తులతో జూబ్లీహిల్స్ రాజకీయం రసవత్తరంగా మారగా ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది కసరత్తు స్టేట్ పాలిటిక్స్ లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
రేవంత్ వ్యూహం ఏంటి?:
జూబ్లీహిల్స్ బై పోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పని మొదలు పెట్టింది. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా మాగంటి సునీత పేరునే దాదాపు ప్రకటించే అవకాశాలు ఉండటంతో రేవంత్ రెడ్డి ఆమెకు పోటీగా ఎవరిని రంగంలోకి దించబోతున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. అధికార పార్టీ కావడంతో టికెట్ దక్కిలే గెలుపు దాదాపు ఖాయం అనే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. దీంతో టికెట్ కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఈ రేస్ లో ముందు వరుసలో ఉన్న అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చి ఆయనను సైడ్ చేసింది అధిష్టానం. దీంతో టికెట్ ఆశిస్తున్న వారిలో రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తో పాటు మరికొంత మంది పేర్లు రేస్ లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఊహించని విధంగా కొత్త మొహాలు తెరపైకి వస్తున్నాయి. తనకు టికెట్ ఇవ్వాలని తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్వరం పెంచుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో రాబోతున్నారు అనేది మరింత ఉత్కంఠ రేపుతోంది.
కూటమి యోచనలో బీజేపీ?:
జూబ్లీహిల్స్ బై పోల్ లో తమ సత్తా చాటేందుకు బీజేపీ (BJP) సైతం ప్రణాళికలు వేసుకుంటోంది. ఇక్కడ సెటిలర్ల ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉండటంతో ఏపీ తరహా ఇక్కడ కూటమి తరహా ప్రయోగం ఏమైనా చేయబోతున్నారా అనేది సందేహంగా మారింది. ఇక్కడ ఇప్పటికే పలువురు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్న కమలం పార్టీ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయారెడ్డిని బరిలోకి దింపే ఆలోచనతోనూ ఉందనే ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ కు కవిత టెన్షన్?:
జూబ్లీహిల్స్ బై పోల్ లో ప్రధాన పార్టీల వ్యూహాలు ఒక ఎత్తైతే ఎమ్మెల్సీ కవిత అంశం మరో ఎత్తు అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత ఇక్కడ నేరుగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒక వేళ పోటీ చేయకపోయినా పరోక్షంగా మద్దతు తెలిపినా అది బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. అయితే ప్రధాన పార్టీలలో టికెట్ లభించని ఆశావహులు కవిత అండతో పోటీ చేయబోతున్నారనే టాక్ నియోజకవర్గంలో గుప్పుమంటోంది.
Read More..
ముంచుకొస్తున్న జూబ్లీహిల్స్ బై పోల్.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు






