- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారాన్ని చూపేందుకు ఆన్ లైన్ విధానానికి శ్రీకారం చుట్టినట్టు ఆ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నెల 24న తొలి సమావేశానికి మంత్రి సీతక్క హాజరు కానున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ అంశాల పరిష్కారానికి ప్రతి నెల రెండో, నాలుగో శుక్ర వారాల్లో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చే వెబ్ లింక్ ద్వారా... సమస్యలున్న ఉద్యోగులు జాయిన్ అయి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ఈ ఆన్లైన్ సమావేశానికి పీఆర్, ఆర్డీ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, పీఆర్ఆర్ డి డైరెక్టర్ సృజన, మిషన్ భగీరథ, రూరల్ ఇంజనీరింగ్ ఈఎన్ సీలు అందుబాటులో ఉంటారు. అవసరమైన సందర్భాల్లో మంత్రి సీతక్క సైతం ఆన్ లైన్ సమావేశాలకు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక మెయిల్ ఐడి ని, వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఉద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి సీతక్క
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతన విధానాన్ని అమలు పరుస్తున్నాం. ఇక హైదరాబాద్ రాకుండానే ఉద్యోగులు ఆన్లైన్లోనే తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారు లంతా ఆన్లైన్ మీటింగ్ లో అందుబాటులో ఉండటంతో ఎలాంటి సమన్వయ లోపం లేకుండా వెంటనే ఉద్యోగ సమస్యలకు, సర్వీస్ కు సంబంధించిన అంశాలకు పరిష్కార మార్గం లభిస్తుంది. సచివాలయంలోని పీఆర్, ఆర్డీ శాఖలో, కమిషనరేట్ కార్యాలయం స్థాయిలో పెండింగ్లో ఉన్న సమస్యలకు ఆన్లైన్ గ్రీవెన్స్ విధానం సత్వర పరిష్కారం చూపిస్తోందన్న నమ్మకం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.






