Seethakka: ఉదయ్ పూర్ పర్యటనలో మంత్రి సీతక్క.. చింతన్ శివిర్ కార్యక్రమానికి హాజరు

by Ramesh Goud |

తెలంగాణ పంచాయితీ రాజ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ పర్యటనలో ఉన్నారు.

Seethakka: ఉదయ్ పూర్ పర్యటనలో మంత్రి సీతక్క.. చింతన్ శివిర్ కార్యక్రమానికి హాజరు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పంచాయితీ రాజ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ పర్యటనలో ఉన్నారు. ఉదయ్ పూర్ లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ(Women And Child Welfare Ministry) ఆధ్వర్యంలో జరిగిన చింతన్ శివిర్(Chinthan Shivir) లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన వివరాలను సీతక్క ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేగాక చింతన్ శివిర్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ఆమె.. చింతన్ శివిర్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమం, భవిష్యత్ కార్యక్రమ వ్యూహాలు మరియు సమాజ శ్రేయస్సు కోసం చర్చలు జరిపినట్లు వివరణ ఇచ్చారు. అలాగే మహిళా సంక్షేమం కోసం సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగుదాం అని సీతక్క పిలుపునిచ్చారు.

Next Story