- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: సిబ్బంది వేతనాలు పెంచండి.. కేంద్ర మంత్రికి సీతక్క విజ్ఞప్తి
by Prasad Jukanti |
కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మూడేళ్ల లోపు పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన పాలన కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది గౌరవ వేతనాలను పెంచాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) వినతిపత్రం సమర్పించారు. ఇవాళ మంత్రి అన్నపూర్ణ దేవిని (Annapurna Devi) వారి నివాసంలో సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్భయ ఫండ్ కింద ములుగు జిల్లాకు ప్రత్యేకంగా రూ.10 కోట్లు కేటాయించినందుకు ఈ సందర్భంగా సీతక్క ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి వివిధ పథకాల కింద రావాల్సిన నిధుల విడుదలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






