సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీతక్క

by Ajay Maddhiboyina |

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం రేష‌న్ షాపుల్లో స‌న్న‌బియ్యం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ల‌బ్దిదారుల ఇంటికి వెళ్లి బియ్యం ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నారు.

సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం రేష‌న్ షాపుల్లో స‌న్న‌బియ్యం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ల‌బ్దిదారుల ఇంటికి వెళ్లి బియ్యం ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నారు. ల‌బ్దిదారుల‌తో క‌లిసి ఆ స‌న్న‌బియ్యంతో భోజ‌నం చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి సీత‌క్క బేగంగ‌పేట్ లోని పాటిగ‌డ్డ‌లో స‌న్న‌బియ్యం ల‌బ్ధిదారుడి ఇంటికి వెళ్లి భోజ‌నం చేశారు.

ఆమెతో పాటూ కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు కోట నీలిమ సైతం ఉన్నారు. స‌న్న‌బియ్యం ఎలా ఉన్నాయ‌ని వారిని అడ‌గ్గా చాలా బాగున్నాయ‌ని చెప్పారు. ఇది వ‌ర‌కు ఫంక్షన్లకు మాత్రమే స‌న్న‌బియ్యం తినేవారిమి అని చెప్పారు. ఇదిలా ఉంటే ఎన్నిక‌ల స‌మయంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత పేద‌ల‌కు స‌న్న‌బియ్యం పంపిణీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఇప్ప‌డు ఆ హామీని నెర‌వేర్చింది. ప్ర‌స్తుతం స‌న్న‌బియ్యం రూ.50కి కేజీ ఉండ‌గా పేద‌ల‌కు పంపిణీ చేయడంపై ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story