Seethakka: గ్రామ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లపై మంత్రి సీతక్క గుడ్ న్యూస్

by Prasad Jukanti |

గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Seethakka: గ్రామ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లపై మంత్రి సీతక్క గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీ కార్యదర్శుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. ఆర్థిక పరమైన డిమాండ్లను కొంత సమయం తీసుకున్నా మిగతా వాటిని వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్ అంబర్ పేటలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ పంచాయతీ కార్యదర్శుల (Grama Panchayat Secretaries) చేతుల్లో ఉందనేది వాస్తవం అన్నారు. సమస్యల పరిష్కారానికి త్వరలోనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని ఈ సమీక్షకు కార్యదర్శుల సంఘం నేతలను ఆహ్వానిస్తామని చెప్పారు.

కార్యదర్శులపై పని భారం నిజమే:

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన నిర్ణయాలతో గ్రామాల్లో వీఆర్ఏ, వీఆర్వోల వ్యవస్ధ రద్ధయిందని దాంతో వారి పని భారం కూడా కార్యదర్శులపైనే పడుతోందని అలాగే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడంతో ఆ పని ఒత్తిడి కూడా కార్యదర్శులపైనే ఉందని సీతక్క అన్నారు. బీసీలుకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే స్థానిక సంస్థలకు ఎన్నికలు ఆలస్యం జరిగిందని త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్ యాడింగ్, అక్రిమెంట్ లు, రెగ్యులరైజేషన్ లతో వారి సమస్యల పరిష్కారం చూపుతామన్నారు. చెక్ పవర్ విషయంలో సమీక్ష చేసి కార్యదర్శల ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏదైనా సమస్యలు వస్తే పై అధికారులు లేదా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 93 వేల మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది అందరికీ గ్రీన్ చానల్ ద్వారా జీతాలు ఇవ్వEబోతున్నామని చెప్పారు. పెండింగ్ బిల్లలను క్లియర్ చేస్తామని భరోసా ఇచ్చారు.

Next Story