మహానాడు ఆదరణ చూసి ఓర్వలేకే దుష్ప్రచారం: బక్కని నర్సింహులు

by Malleboina Mahesh |

టీడీపీ మహానాడుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దుష్ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలోనే టీడీపీ పుట్టిందని బక్కని నర్సింహులు అన్నారు.

మహానాడు ఆదరణ చూసి ఓర్వలేకే దుష్ప్రచారం: బక్కని నర్సింహులు
X

దిశ, వెబ్ డెస్క్: మహానాడు కార్యక్రమానికి వస్తున్న అపూర్వ ప్రజాదరణ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (TDP)కి పెరుగుతున్న గ్రాఫ్ ను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత బక్కని నర్సింహులు మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ, రోజురోజుకూ బలోపేతమవుతుండటాన్ని చూసి భయపడుతున్న కొన్ని దుష్టశక్తులు కావాలనే పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కొంతమంది నాయకుల స్వార్థ రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రం బలి కాకూడదని బక్కని నర్సింహులు హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, ఈ ప్రాంతంతో పార్టీకి విడదీయరాని అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) గతంలో నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చారిత్రక నేపథ్యాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకుంటూ.. పార్టీ శ్రేణులు.. వివిధ పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Next Story