- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్ లో నరకం చూస్తున్నా.. ఇండియాకు రప్పించు రేవంతన్నా.. పాలమూరు యువకుడి రిక్వెస్ట్
రేవంతన్న నన్ను ఇండియాకు రప్పించు ప్లీజ్ అని ఓ పాలమూరు బిడ్డ చేసిన సెల్ఫీ వీడియో (Selfi Video) సోషల్ మీడియా (Social Media)లో హల్ చల్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రేవంతన్న నన్ను ఇండియాకు రప్పించు ప్లీజ్ అని ఓ పాలమూరు బిడ్డ చేసిన సెల్ఫీ వీడియో (Selfi Video) సోషల్ మీడియా (Social Media)లో హల్ చల్ చేస్తోంది. దుబాయ్ (Dubai)లో ఇరుక్కుపోయి నరకం చూస్తున్నానని, దయచేసి నన్ను ఇండియా (India)కు తీసుకొని పోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM revanth Reddy)ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. వీడియోలో ఆ యువకుడు మాట్లాడుతూ.. తన పేరు గోపాల్ అని, దుబాయ్ లో ఆరు సంవత్సరాలు ఓ కంపెనీలో ఉద్యోగం చేశానని చెప్పాడు. తన పేరు మీద ఓ వ్యక్తి సిమ్ తీసుకొని మోసం చేశాడని, దీంతో గత సంవత్సరం ఇండియాకు రావాలనుకున్న తనను పోలీసులు 9 వేల ఫైన్ ఉంది అని నిలిపివేసినట్లు వెల్లడించారు.
ఫైన్ కట్టలేదని మూడు నెలలు జైళ్లో వేశారని, తాను నిర్ధోషి అని తెలిసి ఇటీవలే విడుదల చేశారని తెలిపాడు. అయితే ఇండియాకు రావాలంటే ట్రావెట్ బ్యాన్ (Travel Ban) ఎత్తివేయాలని చెప్పారని, దీనిని మా యజమానులు పట్టించుకోకపోవడంతో ఇండియాకు రాలేకపోతున్నానని వివరించాడు. అలాగే ఎనిమిది నెలల నుంచి నరకం చూస్తున్నానని, ఒక్కరోజు తిండి తింటూ.. రోడ్ల మీద బ్రతుకు వెల్లదీస్తున్నానని యువకుడు వాపోయాడు. దయచేసి నాపై ఉన్న ట్రావెల్ బ్యాన్ ఎత్తేసేలా చూసి, నన్ను ఇండియాకు తీసుకొని పోయే ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గోపాల్ వీడియో ద్వారా వేడుకుంటున్నాడు.






