- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం! రాష్ట్రపతి శీతాకాల విడిది తేదీలు ఖరారు
శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌కు రానున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ విమానాల ఎగరవేతపై నిషేధం విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 17, 22 తేదీల్లో, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 20న ఎలాంటి రిమోట్ కంట్రోల్ విమానాలు, డ్రోన్లు ఎగరవేయరాదని స్పష్టం చేశారు. డ్రోన్లు, ఇతర ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






