- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జీరో ఎర్రర్’తోనే భద్రత సాధ్యం.. తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు 41 ఏళ్లు
భద్రతా రంగంలో అప్రమత్తత అత్యంత కీలకమని ఐఎస్‌డబ్ల్యు ఓఎస్డీ బి.వి. కమలాసన్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భద్రతా రంగంలో అప్రమత్తత అత్యంత కీలకమని ఐఎస్‌డబ్ల్యూ ఓఎస్డీ బి.వి. కమలాసన్ రెడ్డి తెలిపారు. ఒక్క చిన్న తప్పు జరిగినా అది పూర్తి వైఫల్యంగానే పరిగణిస్తారని, భద్రతా దళాలు ‘జీరో ఎర్రర్’ విధానంతో పని చేయాలని సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. 1984లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య, ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పీడబ్ల్యూజీ (PWG) దాడుల నేపథ్యంలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 1985 ఏప్రిల్ 2న ఈ విభాగం ఏర్పాటు అయినట్లు ఓఎస్డీ బి.వి. కమలాసన్ రెడ్డి గుర్తు చేశారు.
విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఇకపై ఏటా 'ఐఎస్‌డబ్ల్యూ ఛాంపియన్ ట్రోఫీ’ అందజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఐఎస్‌డబ్ల్యూ (ISW) అత్యంత రహస్యమైన, కీలకమైన విభాగమని, వీఐపీ భద్రతలో తెలంగాణ అధికారులు ప్రదర్శిస్తున్న నైపుణ్యాన్ని ఇతర రాష్ట్రాలు సైతం ప్రశంసిస్తున్నాయని సీఎంఎస్‌జీ సెక్యూరిటీ అధికారి జి. చక్రవర్తి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్స్ ఎస్పీ శ్రీనివాస చారి, ఎస్పీ సయ్యద్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.






