- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్రెగుట్టపై జెండా పాతిన కేంద్ర బలగాలు
కేంద్ర ప్రభుత్వం గత కొద్దిరోజులుగా ఆపరేషన్ కరాగ్ (Karag) పేరుతో మావోయిస్టుల జాడలేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం గత కొద్దిరోజులుగా ఆపరేషన్ కగార్ (Kagar) పేరుతో మావోయిస్టుల జాడలేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై గత కొద్దిరోజులుగా కేంద్ర బలగాలు మావోల కోసం జల్లెడ పడుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లు చేస్తూ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారు ఉంటున్న స్థావరాన్ని సైతం సీఆర్పీఎఫ్(CRPF) స్వాధీనం చేసుకోగా తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్రెగుట్టలపై భద్రతా బలగాలు పూర్తిగా పట్టు సాధించాయి.
9 రోజుల పాటూ జరిగిన ఆపరేషన్‌లో బలగాలు విజయం సాధించాయి. నేరుగా కర్రెగుట్ట(Karregutta) ప్రాంతానికి ఐబీ చీఫ్ చేరుకున్నారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఆపరేషన్ గురించి ఐబీ చీఫ్‌కు వివరించారు. కర్రెగుట్టల పైప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయబోతున్నట్టు తెలస్తోంది. దీంతో సీఆర్‌పీఎఫ్ అటు ఛత్తీస్‌గఢ్ ఇటు తెలంగాణ ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది.






