మరోసారి కేసీఆర్ నివాసానికి పోలీసులు.... నందినగర్‍లో భద్రతా చాలెంజ్!

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను ఎక్కడ ప్రశ్నించబోతున్నారు అనేది సస్పెనస్ గా మారింది. ఈ క్రమంలోనే నందినగర్ నివాసానికి పోలీసులు రెండోసారి వచ్చారు.

మరోసారి కేసీఆర్ నివాసానికి పోలీసులు.... నందినగర్‍లో భద్రతా చాలెంజ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) రేపు మధ్యహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్‍కు (KCR) సిట్ (SIT) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్‍లోని నంది నగర్‍లోని (Nandinagar) ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన అధికారులు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యే విషయంలో మాత్రం ఆప్షన్స్ ఇచ్చారు. 65 ఏళ్ల వయసు దృష్ట్యా పీఎస్ కు రావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతంలో మేమే వచ్చి విచారిస్తామని అందుకు వివరాలు తెలిపాలని సూచించారు. సిట్ నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరుపై ఇంకా కేసీఆర్ స్పందించనప్పటికీ విచారణకు హాజరైతే గనుక విచారణ ఎక్కడ జరగబోతోందనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఇవాళ సిట్ అధికారులు వచ్చి వెళ్లిన తర్వాత నందినగర్ నివాసానికి పోలీసులు రావడం ఆసక్తిగా మారింది. సిట్ విచారణ నేపథ్యంలో పోలీసుల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

భద్రతా చాలెంజ్:

పోలీసుల రాకతో కేసీఆర్‍ను నందినగర్ నివాసంలోనే ప్రశ్నించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే విచారణ సందర్భంగా నందినగర్ లో భద్రతా ఏమేరకు ఉంటుందనేది చర్చగా మారింది. ఇప్పటి వరకు విచారించిన వారందరిని సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పీఎస్‍కు పిలిపించి ప్రశ్నించారు. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం పోలీస్ స్టేషన్ కు బదులు నందినగర్ లో విచారణ జరిపితే భద్రతా పరమైన ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇటీవల హరీశ్‍రావు, కేటీఆర్విచారణకు హాజరైన సందర్భంగా జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద పోలీసులు, బీఆర్ఎస్ శేణులకు మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఒకదశలో ఇరు వర్గాల మధ్య తోపులాట పరిస్థితి కనిపించింది. అలాంటిది రేపు నందినగర్ లోని ఇంటి వద్ద విచారణ జరిగితే కేసీఆర్ అభిమానులు, పార్టీ నేతల హడావుడి ఎలా ఉండబోతోంది అనేది చర్చగా మారింది. అయితే హరీశ్ రావు, కేసీఆర్ విచారణ సమయంలోని అనుభవాల దృష్ట్యా నందినగర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Next Story